బల్వంత్ (ఎన్.ఎ.-1౦):
కాయలు మధ్యస్తం నుండి పెద్ద పరిమాణంలో ఆకర్షనీయంగా వుంటాయి. బరువు – 41 గ్రా. కాయలు గుండ్రంగా వుండి చర్మం గరుకుగా లేత ఆకుపచ్చని రంగులో పింక్ వర్ణం మిళితమై వుంటుంది. అయిదారు సంవత్సరాలు చెట్ల నుండి 42 కిలోల దిగుబడి వస్తుంది. 1౦౦ గ్రా.ల కాయ గుజ్జులో 528 మి.గ్రా. విటమిన్ సి వుంటుంది.
నీలం (ఎన్.ఎ.-7):
కాయలు మధ్యస్తం నుండి పెద్ద సైజులో ఉంటాయి. బరువు - 46 గ్రాములు. చర్మం నున్నగా వుండి, పండులోని కండ మెత్తగా పీచు లేకుండా వుంటుంది. ఈ రకం నేక్రోసిస్ వ్యాదికి తట్టుకుంటుంది. అయిదారు సం.ల చెట్ల నుండి 5౦ కిలోల దిగుబడి వస్తుంది. 1౦౦ గ్రాముల గుజ్జులో 788 మి.గ్రా. ల విటమిన్ ‘సి’ వుంటుంది.
అమ్రిత్ (ఎన్ . ఎ. – 6):
కాయలు మధ్యస్తంగా, నునుపైన చర్మంతో 6 చారలు కలిగి ౩5-౩7 గ్రా. బరువు కలిగి వుంటాయి. జాం, క్యాండీ వంటి పదార్ధం తయారికి అనుకూలం. అయిదారు సంవత్సరాల చెట్ల నుండి ౩5-4౦ కిలోలదిగుబడి వస్తుంది. 1౦౦ గ్రా. గుజ్జులో 7౦7 మి.గ్రా. విటమిన్’సి’ వుంటుంది.